బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కోట్లమంది ఫాలోయర్స్ కు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా లో దీపికా ఏ రేంజ్ లో ఫాలోయర్స్ ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. వారిని ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్ పిక్స్ తో పాటు సినిమాలకు సంబదించిన విశేషాలను తెలియపరుస్తూ వస్తుంటుంది. ఈమె పెట్టె పిక్స్ చూసేందుకు చాలామంది ఈమెనే ఫాలో అవుతుంటారు.
ప్రస్తుతం ఈమె ఇన్ స్టా గ్రామ్ లో 52.5 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. అంతమందిని ఇప్పుడు మోసం చేసింది. అదేలా అనుకుంటున్నారా..తన అకౌంట్ లో ఉన్న వీడియోలు మరియు ఫొటోలు అన్నింటిని ఆమె తొలగించి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది. తన అకౌంట్ నుండి అన్ని పోస్ట్ లను డిలీజ్ చేసింది. ఇప్పటికే ట్విట్టర్ ఖాతాను ఖాళీ చేసిన దీపిక పదుకునే తాజాగా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను కూడా ఖాళీ చేయడం పట్ల రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సడెన్ గా ఇలా అకౌంట్ ఖాళీ చేయడం వెనుక కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.