యాంగ్రి యంగ్ మ్యాన్ రాజశేఖర్ కు ఇద్దరు కూతుళ్ళు వారి పేర్లు శివాని, శివాత్మిక. ఈ ఇద్దరు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. శివాత్మిక దొరసాని సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేసింది. అలాగే కృష్ణ వంశీ రంగమార్తాండ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే పంచతంత్రం సినిమాలో కూడా ఆమె నటిస్తున్నది.
రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కూడా టాలీవుడ్ ఎంట్రీ కి ఎప్పుడో రంగం సిద్దం అయ్యింది. 2 స్టేట్స్ అనే చిత్రంలోనటించిన ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అలాగే డబల్యూడబల్యూడబల్యూ అనే చిత్రంలో నటిస్తుంది. టాలీవుడ్ తో పాటుగా కోలివుడ్ లోకి శివాని త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. హింది మూవీ ఆర్టికల్ 15 ను తమిళంలో బోణి కపూర్ నిర్మాత గా సిఎం స్టాలిన్ కొడుకు ఉదయనిది స్టాలిన్ హీరోగా ఆ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని నటించబోతుంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే తమిళనాడు అసెంబ్లి ఎన్నికల్లో ఎంఎల్ఏ గా పోటీ చేసి గెలుపొందిన ఉదయానిధి స్టాలిన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. అలాగే నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు సినిమాలు నిర్మిస్తున్నాడు.