“చాలా ఏళ్ళ కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ విజువలైజ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మైండ్ లో తిరుగుతూనే ఉంది.
నా ఫస్ట్ ఫిల్మ్ ‘డాలర్ డ్రీమ్స్’ లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో యూస్ చేసినందుకు సోని కంపెనీ కి నేను పే చేసా, ఫిల్మ్ లో క్రెడిట్స్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’ లో లక్కి అలి తో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్ లో సుబ్బలక్స్మి గారి పాట నుండి ఫిదాలో మల్లీశ్వరి సినిమా లో ని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమా కి ఒకో పాట తిరుగుతుంటుంది. లవ్ స్టోరీ ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.
ఫొన్ నంబెర్ సంపాదించి, ఆమెని కాంటాక్ట్ చేశారు. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరొన వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యింది. న్యూ బార్న్ బేబీ తో ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు.
ఈ పాట ని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వెర్షన్ తోనే. ఫిబ్రవరి ఆఖరులో మంగ్లి తో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ‘ఇద్దరు సింగర్స్ ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని’. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో ఏడి ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.
ఈలోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కొమలే ఆ పాట ని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం’ అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసాం కాబట్టి, కోమల ని వెంటనే రమ్మని’ అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ని చెన్నయ్ నుండి రప్పించాం. ‘జలుబు ఉంది, రాలేను’ అంది కోమల. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. జెన్యూన్ కేస్ సర్ క్రెడిట్ తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారు అన్నారు. కోమల ని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను.
ఆడియో ఫంక్షన్ లో పాడమని, విసిబిలిటీ బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది.
సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు – ఫేస్ బుక్ లో కోమల కి థాంక్స్ చెప్పాను.
మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమల కి మేం ప్రామిస్ చేసినట్టు ఫిల్మ్ లో క్రెడిట్ ఇస్తాం, మనీ ఇస్తాం, ఆడియో ఫంక్షన్ విఎఫ్ఎక్స్ అయితే , కోమలకి పాడమని ఇన్విటేషన్ పంపిస్తాం.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టివి ల్లో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకేసారి ఫేస్ బుక్ లో అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థాంక్స్ టూ అల్.”