తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో పరిచయం అయిన సంయుక్త హెగ్డే. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ ను సహాయం చెయ్యాలిసింది గా కోరుతుంది. ఇంతకు ఆమెకు వచ్చిన కష్టం ఏమిటో తెలిస్తే పాపం అలాంటి స్టార్ హీరోయిన్ కే అలాంటి పరిస్థితి ఉంటే మనలాంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అనిపిస్తుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది కరోనా భారీన పడి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు కరోనా భారీన పడుతున్నారు. రీసెంట్ గా కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే తల్లితండ్రుల కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఇంట్లోనే ఇసోలెట్ అవ్వుతున్నారు.
ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది అంట. రెమిడెసివిర్ ఇంజక్షనులు కావాలని డాక్టర్స్ సూచించడంతో తన వద్ద ఉన్న ఫోన్ కాంటాక్ట్ లతో తెలిసినవారికి ఫోన్ చేసి అడిగింది కానీ. అవి ఇప్పుడు ఎక్కడ దొరకడంలేదు. హాస్పిటల్ కు తీసుకుపోదాం అంటే మా నాన్న గారు రావడం లేదు. భయపడిపోతున్నాడు.
అందుకే సంయుక్త హెగ్డే సోషల్ మీడియా ద్వారా రెమిడెసివిర్ ఇంజక్షనులు ఎవరి వద్దనైనా ఉంటే సహాయం చెయ్యాలిసింది కోరుతుంది. కరోనా వలన ఆక్సిజన్ కొరతతో పాటుగా ఇంజక్షనులు కూడా లభించే పరిస్థితిలేదు.