ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తన దూకుడు పెంచింది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సమంత తో ఒక టాక్ షో చేస్తుంది. ‘సామ్ జామ్’ పేరుతో ఈ టాక్ షో ప్రేక్షకులను అలరిస్తుంది. డిజిటల్ మాధ్యమంలో ఈ స్పెషల్ షోను హోస్ట్ చేయడానికి సమంత భారీ రెమ్యునరేషన్నే తీసుకుంటుందని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్నసమాచారం మేరకు సమంత ఓ ఎపిసోడ్కు రూ.పదిహేను లక్షలు ఛార్జ్ చేస్తుందట. కాగా ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. ఈ లెక్కన మొత్తంగా చూస్తే ఈ షో ద్వారా సమంతకు రూ.1.8 కోట్లు రెమ్యునరేషన్ దక్కుతుంది.
ఇదిలా ఉంటె.. విజయ్ దేవరకొండ తో జరిగిన ఎపిసోడ్ ఫై నెగిటివ్ టాక్ నడుస్తుంది. ఆహా ఓటిటి నుండి సమంత టాక్ షో అనగానే అందరిలో భారీ అంచనాలు.. అందులోను విజయ్ దేవరకొండ గెస్ట్ అనగానే షో కాస్త డిఫ్రెంట్ గా ఉంటుందేమో… అనుకుంటే…. రొటీన్ టాక్ షో మాదిరి సామ్ జామ్ ఉండడంతో.. ప్రేక్షకుల పెదవి విరుపులు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. సమంత షో అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటే.. ఇక్కడేం కనిపించలేదంటున్నారు.