కన్నడ చిత్రం కేజిఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే చిత్రంను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హేంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. మొదట హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ నుండి షూటింగ్ ను మొదలు పెట్టిన చిత్ర బృందం తర్వాత సెట్ ను తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని కి మార్చారు. అక్కడే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ నేపథ్యంలో అక్కడ భారీ సెట్ ను చిత్ర బృందం నిర్మించింది. ఈ విషయంపై తరుచు చిత్రం బృందం తెలంగాణ పోలీసు అధికారులతో టచ్ లో ఉంటున్నారు. అలాగే ప్రభాస్ నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ కి టైట్ సెక్యూరిటీ ని కల్పించాలని చిత్ర బృందం పోలీసు అధికారులను కోరింది. ఎందుకంటే గోదావరిఖని లో షూటింగ్ జరుగుతుండటంతో జనాలు, ప్రభాస్ అభిమానులు విపరీతంగా సెట్ వద్దకు చేరుకోవడం, మరీ ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండటం అందుకు కారణం.
ప్రభాస్ సలార్ చిత్రంతో పాటుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే చిత్రంలో నటించనున్నాడు. ప్రభాస్ నటిస్తున్న మొదటి స్ట్రెయిట్ హిందీ మూవీ కావున ఈ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇప్పటికే ఓం రౌత్ ముంబై లో అదిపురుష్ సెట్ ను వేసి రెడీ గా ఉన్నారు. ప్రభాస్ కూడా అక్కడ సలార్ షూటింగ్ పూర్తి చేసుకొని వెంటనే అదిపురుష్ షూటింగ్ లో పాల్గొననున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పెద్ద చిత్రాలతో ప్రభాస్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.