లాక్ డౌన్ దెబ్బకు థియేటర్స్ మూతపడడం తో ఓటిటి సంస్థలకు ఫుల్ డిమాండ్ వచ్చింది. సినీ ప్రేక్షకులు , సినీ లవర్స్ సైతం ఓటిటి కి బాగా అలవాటు పడ్డారు. దీంతో పలు ఓటిటి సంస్థలు సినిమా కొనుగోళ్ల విషయంలో దూకుడు కనపరుస్తున్నారు. సెట్స్ ఫై ఉండగానే భారీ ఎమౌంట్ ఇచ్చి రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాల విషయాల్లో ఆలా జరుగగా..తాజాగా ప్రతి రోజు పండగే సినిమా తో సూపర్ హిట్ అందుకున్న సాయి తేజ్ కొత్త చిత్రాల విషయాల్లో అదే జరిగింది.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సోలో బతుకే సో బెటరు సినిమాను ఫస్ట్ కాపీ జీ టీవీ వారు కొనుగోలు చేసాడు. ఇప్పుడు అదే సంస్థ తేజు మరో సినిమాను నిర్మాణంలో వుండగానే కొనేసింది. పైగా నిర్మాణానికి ఫండింగ్ ఇస్తోంది. దీంతో నిర్మాత సంబరాలు చేసుకుంటున్నాడు. సాయి ధరమ్ తేజ్-దేవా కట్టా కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. దీనిని భగవాన్ పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూలు పనిలో వుండగానే జీటీవీ వారు 35 కోట్లకు వరల్డ్ రైట్స్ కొనుగోలు చేశారట. ఈ ప్రైస్ తో నిర్మాత హ్యాపీ గా ఫీల్ అవుతున్నాడట. సినిమాను పాతిక కోట్లలో కంప్లీట్ చేసుకోగలిగితే నిర్మాతకు లాభమే అని మాట్లాడుకుంటున్నారు. మరి దేవాకట్టా ఏంచేస్థాడో..