‘పెళ్లి చూపులు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన రీతూ వర్మ..మొదటి చిత్రంతోనే యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్న ఈమె..తన కలలను కరోనా ఆవిరి చేసిందంటూ చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిచిపోయింది. ఆ వెంటనే దుల్కర్‌తో చేసిన సినిమా సూపర్ హిట్ కావడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో 2020 సంవత్సరం నాకు మరుపురానిదిగా మిగిలిపోతుందని, ఏడాది చివరి రోజు వరకు ఈ ఆనందం కొనసాగుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. అప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ ఈ ఏడాది విడుదల కావాల్సినవే. అయితే కరోనా దెబ్బకు ఆ సినిమాల షూటింగులన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది నాకు తీవ్ర నిరాశ మిగిల్చింది’ అని చెప్పుకొచ్చింది.