![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/renu-desai-who-came-out-for-dinner-after-recovering-from-corona.jpg?resize=800%2C500&ssl=1)
కరోనా మహమ్మారి పర తమ బేధం లేకుండా అందరినీ ముప్పు తిప్పలు పెట్టింది. సామాన్యుని నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోకింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయితే ఒక్కొక్కరిలో భయం అంటే ఏంటో చూపించాయి. ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టాలంటే గజ గజ వణికేలా చేశాయి. సమాజానికి దూరంగా ఒంటరితనానికి దగ్గరగా తోసేసింది కరోనా. ఇంట్లో వాళ్ల నుండే దూరం ఉండే దుస్థితి తెచ్చి పెట్టింది ఆ మహమ్మారి. థర్డ్ వేవ్‌లో కూడా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా సాగింది. రోజూ లక్షలాది మందికి సోకింది. అయితే అంతే వేగంగా కేసులు తగ్గుముఖం పట్టాయి.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/renu-desai-who-came-out-for-dinner-after-recovering-from-corona-2.webp?resize=509%2C339&ssl=1)
కరోనా మూడు వేవ్ లలో చాలా మంది దీని బారిన పడ్డారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులను కూడా కొవిడ్ వదల్లేదు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి ఎంతో మంది స్టార్ హీరోలు, పలువరు నటీ నటులు కొవిడ్ బారిన పడ్డారు. ఈ జాబితిలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉంది. ఆమెకు కరోనా సోకగా.. ఈ మధ్య వైరస్ ను జయించారు.
అసలు ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తనకు వైరస్ సోకిందని రేణూ దేశాయ్ వాపోయింది. అకీరా నందన్‌కు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఇద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పింది. అభిమానులెవరూ కంగారు పడొద్దని చెప్పుకొచ్చింది. రేణూ దేశాయ్, అకీరా నందన్ లు ఇద్దరూ సుమారు 10 రోజులు హోం క్వారంటైన్ లో ఉన్నారు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/renu-desai-who-came-out-for-dinner-after-recovering-from-corona-1.jpg?resize=1024%2C768&ssl=1)
కరోనా తగ్గిన తర్వాత రేణూ దేశాయ్ బయటకు వచ్చింది. కరోనా సోకి దాదాపు 10 రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాత ఇలా బయటకు రావడం డిన్నర్ చేయడం చాలా కొత్తగా ఉందని చెప్పింది రేణూ దేశాయ్. క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు చాలా బోర్ ఫీలైనట్లు చెప్పింది.