ప్రస్తుత జెనరేషన్ లో కథానాయకలు హీరోలకు పోటీగా ఉండే పాత్రలో నటించడానికి సిద్దం అవ్వుతున్నారు. అది ఎలాంటి పాత్ర అయిన సరే సినిమాకు ఆ పాత్ర ప్లస్ అవ్వుతుందంటే ఇప్పటి తరం హీరోయిన్స్ నటించడానికి వెనకాడటం లేదు. ఈ కోవలోకి ప్రస్తుతం తమిళ నటీమణి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చేరిపోయింది. విశాల్ పందెం కోడి 2, విజయ్ సర్కార్, రీసెంట్ గా తెలుగులో వచ్చిన క్రాక్ చిత్రంలో లేడి విలన్ పాత్రలో నటించి మెప్పించింది.
ఇప్పుడు ఆమె దారిలోకి మరో హీరోయిన్ అడుగులు వేస్తుంది. ఆమే రెజీనా కసాండ్ర. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. మొదటి సినిమాలోని తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, పిల్ల నువ్వు లేని జీవితం వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకు వచ్చాయి. తెలుగు సినిమాలతో పాటుగా తమిళ కన్నడ సినిమాలోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలో ఆమె యాక్షన్ హీరో విశాల్ తో చక్ర అనే చిత్రంలో నటించింది.
ఈ చిత్రానికి ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహించాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రెజీనా లేడి విలన్ పాత్రలో నటించింది. ఈ పాత్ర గురించి రెజిన మాట్లాడుతూ… ముందుగా ఈ చిత్రంలో ప్రతి నాయకి పాత్ర నా దగ్గరికి వచ్చినప్పుడు చేసేందుకు నేను సిద్దంగా లేను అని చెప్పి పంపించాను. ఆ తర్వాత ఈ చిత్రంయొక్క సినిమాటోగ్రాఫర్ కేటి బాలసుబ్రమణ్యన్ ఫోన్ చేసి మీరు పాత్ర చేయండి మంచి గుర్తింపు వస్తుందని చెప్పాడు.
ఆయన కోరిక మేరకే నటించాను. పబ్లిక్ నుండి నా పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా అందంగా ఉందని రెజీనా అంటుంది. ఇక భవిష్యత్తులో తప్పకుండ నా నుండి డిఫ్ఫరెంట్ రోల్స్ ను మీరు ఎక్స్ ఫెక్ట్ చెయ్యొచ్చు అని అన్నారు. హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోతే సినిమాలలో ఐటెమ్ సాంగ్స్ కు పరిమితమైపోయే రోజులు పోయాయి.