![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2021/04/Recently-NTR-Watching-Pawan-Kalyan-Vakeel-Saab-Movie.jpg?resize=800%2C450&ssl=1)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ లు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ చిత్రంలో లాయర్ నందా పాత్రలో నటించాడు.
ఈ చిత్రం మంచి విజయం సాదించడంతో చాలా మంది సినిమా ప్రముఖులు సోషల్ మీడియా వేధిక గా అభినందనలు తెలియజేస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత పవన్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో అన్నీ రకాల ప్రేక్షకులను మెప్పించాడు. పవన్ కు అపోసిట్ లాయర్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ నందా అనే పాత్రలో నటించాడు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2021/04/NTR-Give-The-One-Hug-To-Pawan-Kalyan.jpg?resize=800%2C450&ssl=1)
ప్రకాష్ రాజ్ కూడా పవన్ కు ధీటుగా నటించాడు. వకీల్ సాబ్ సక్సెస్ మీట్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూ లలో ఆసక్తి కర విషయాలను పంచుకున్నాడు. వకీల్ సాబ్ చిత్రాన్ని ఇటీవలే జూనియర్ ఎన్టిఆర్ చూసాడు అని చెప్పాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆడవారిపై జరిగే అన్యాయాలపై పవన్ కళ్యాణ్ పోరాటం చూసి పవన్ హగ్ చేసుకున్నట్లుగా ప్రకాష్ రాజ్ తెలిపాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ బయట పెట్టడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2021/04/Prakash-Raj-comments-On-NTR-And-Pawan-Kalyan.jpg?resize=800%2C450&ssl=1)