టాలీవుడ్ హీరో రవి తేజ ఈ ఏడాది ప్రారంభంలో క్రాక్ చిత్రంతో హిట్టు కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు. ఈ చిత్రానికి గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించాడు. రవి తేజ సరసన శృతి హాసన్ నటించింది. థమన్ అద్బుతమైన సంగీతం తో క్రాక్ పాటలు అలరిస్తున్నాయి. వరస ఫ్లాప్స్ తో సతమతం అవ్వుతున్న రవి తేజకు ఈ చిత్రం మంచి ఊరటను ఇచ్చింది.
ఏడాది కి రెండు సినిమాలు లైన్లో పెట్టె మాస్ మహారాజ్ ఓ సినిమా తర్వాత మరో సినిమా ను చేసుకుంటూ వస్తున్నాడు. నేడు రవి తేజ పుట్టిన రోజు కావున ఆయన తదుపరి సినిమా ఖిలాడిలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఖిలాడి చిత్రాన్నికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రవి తేజ పక్కన హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి లు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నేడు ఈ చిత్రం నుండి ఫస్ట్ గ్లింప్సే ను విడుదల చేశారు మేకర్స్. చేతిలో రాడ్ పట్టుకొని ఎదురుగా కారులో వస్తున్న విలాన్స్ కి ఎదురు పోతున్నట్లుగా ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. రవి తేజ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏ స్టూడియోస్ పై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ లు నిర్మిస్తున్నారు. ఖిలాడి చిత్రా దర్శకుడు గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తమిళ్ రాట్సన్ మూవీని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశాడు. రవి తేజతో ఈ దర్శకుడికి ఇది రెండోవ చిత్రం ఇంతకు ముందు వీర అనే చిత్రంను తీశాడు.