కరోనా కారణంగా ఇండియన్ సినీ ప్రముఖులు ఓటీటీ దారి పట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అయిదు నెలలుగా థియేటర్లు మూత బడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో షూటింగ్స్ కు కూడా పెద్ద సినిమాలు వెళ్లడం లేదు. కనుక ఓటీటీ కోసం వెబ్ సిరీస్ ల్లో అయినా నటించాలని కొందరు భావిస్తున్నారు.
ఆ జాబితాలో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇటీవలే హృతిక్ రోషన్ ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ను హిందీలో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక తెలుగులో కూడా ఓటీటీ కోసం నటించేందుకు కొందరు స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో రవితేజ ముందు ఉంటాడు అనిపిస్తుంది.
ఎందుకు అంటే ఈయన హీరోగా నటిస్తున్న సినిమాలు నిరాశ పర్చుతున్నాయి. ఇలాంటి సమయంలో హీరోగా కాకుండా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు కూడా ఓకే చెప్పడం వల్ల ఆర్థికంగా మరియు ఇతర విషయాల పరంగా లాభం పొందవచ్చు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ ఆలోచన బాగానే ఉంది. అయితే ప్రస్తుతానికి వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఓకే చెప్పి మళ్లీ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా ఆయన అనుకుంటున్నాడట.
ఆయన ఆలోచన ఏంటీ అనేది కొన్ని రోజుల తర్వాత వెళ్లడి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈయన నటించిన క్రాక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. థియేటర్ల ఓపెన్ కోసం ఆ సినిమా వెయిట్ చేస్తోంది. ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చినా కూడా నిర్మాతలు నిరాకరించారు. కాని రవితేజ మాత్రం ఓటీటీకి ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.