మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ గ్యాప్ ను ఇప్పుడు ఫుల్ ఫిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. క్రాక్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.
ఇదిలా ఉంటె ప్రస్తుతం రవితేజ..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతికి నో చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ప్రతిరోజూ పండగే
సినిమాతో ఘనవిజయం అందుకున్న మారుతి.. దాని తర్వాత రవితేజతో సినిమా చేయాలనుకున్నాడు. రవితేజకు కథ కూడా వినిపించాడు. ఆ కథ నచ్చడంతో రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టు తాజా సమాచారం. పారితోషికం విషయంలో తేడా రావడంతో ఆ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్లో గీతా-2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను ప్లాన్ చేశాయి. ప్రస్తుతం మారుతీ ఆ కథను గోపీచంద్ తో చేయాలనీ అనుకుంటున్నట్లు వినికిడి.