కన్నడ భామ రష్మిక (Rashmika)మందన్న మారిపోయిందా.. అమ్మడు కొత్త సినిమాల విషయాల్లో తెలుగు దర్శక నిర్మాతలను చిన్న చూపు చూస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మికని స్టార్ హీరోయిన్ చేసింది తెలుగు సినిమాలే. ఇక్కడ ఛలో నుండి పుష్ప వరకు అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈ క్రేజ్ తోనే తమిళంలో రెండు సినిమాలు చేసింది. ఇదిలాఉంటే అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు చేస్తుంది.
ఈ రెండు సినిమాలు క్రేజీగా రానున్నాయి. ఈ సినిమాలతో పాటు మరికొన్ని బాలీవుడ్ ఆఫర్స్ హోల్డ్ లో ఉన్నాయట. అందుకే ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్ వచ్చినా సరే అమ్మడు సున్నితంగా చేయనని తిరస్కరించిందట. తెలుగు సినిమాలతోనే ఈ రేంజ్ స్టార్ డం తెచ్చుకుని ఇప్పుడు బాలీవుడ్ మోజులో పడి రష్మిక (Rashmika) తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటుందని అంటున్నారు.
పుష్ప తర్వాత అమ్మడు తెలుగు ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ఎంత బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా తనని స్టార్ ని చేసిన తెలుగు సినిమాలు చేయకపోతే అంతకుముందు హీరోయిన్స్ లానే రష్మికకి గట్టి షాక్ తగలక తప్పదు.