రష్మి గౌతమ్ ఓడిశా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వైజాగ్ అమ్మాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడే టివి యాంకర్ గా, సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రానిస్తుంది. ఉదయ్ కిరణ్ హోలీ సినిమా తో పరిచయం అయ్యింది. అక్కడి నుండి చిన్న చిన్న పాత్రలను చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రేక్షకుల్లోకి రీచ్ కాలేకపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ షో కు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక అక్కడినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులకు నవ్వులు తెప్పించేది. ఆ షో హిట్ కావడంతో రష్మికి టివి తెరపై అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఢీ జోడీ, ఢీ 10 షో లకు యాంకర్ గా చేస్తుంది. ఈ నేపథ్యంలో రష్మికి మంచి పేరు రావడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. పాత్ర ఎలాంటిది అయిన సరే ఎంత బొల్డ్ గా ఉన్న, హీరో ఎవరైనా అడ్డు చెప్పకుండా గ్లామర్ షో చేసింది. ఇప్పుడు అదే ఆమెకు పెద్ద మైనస్ గా మారింది.
గత రెండు మూడు ఏండ్ల నుండి రష్మి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రాలు ఏమి లేవు. అందుకే ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్. కథ బలం ఉన్న పాత్రలను మాత్రమే చెయ్యాలని రష్మి భావిస్తుంది. తనతో పాటు కెరీర్ ను మొదలు పెట్టిన అనసూయ సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ తో రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. తాను అనసూయ బాటలోనే కథాబలం ఉన్న పాత్రలనే చెయ్యాలనే ఆలోచనలో ఉంది రష్మి.