![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/11/rashi-30.jpg?resize=600%2C337&ssl=1)
ఊహలు గుసగుసలాడే బ్యూటీ రాశిఖన్నా థర్టీ ప్లస్ లో చేరింది. 1990 , నవంబర్ 30 న ఢిల్లీ లో జన్మించిన ఈమె..ప్రస్తుతం 30 వ ఈటా అడుగుపెట్టింది. ఆరేళ్ల క్రితం ఊహలు గుసగుసలాడే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. బ్రేక్ లేకుండా నటిస్తూనే వుంది కానీ మరీ అద్భుతమైన బ్రేక్ అయితే రాలేదు.
కానీ సన్నగా, పొడవుగా మెరుపుతీగలా వుండే రాశీఖన్నాకు గ్లామర్ లోటు అయితే లేదు. నటన కూడా ఒకె. కానీ అదృష్టమే అమ్మడికి లేకుండా పోతుంది. అయినప్పటికీ రాశికి వరుస ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇక రాశి పుట్టిన రోజు సందర్భాంగా సోషల్ మీడియా లో సినీ స్టార్స్ , అభిమానులు ఆమెకు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ ఆకట్టుకుంటున్నారు.