దర్శక ధీరుడు రాజమౌళి చాల మొండి..తాను అనుకున్నది అనుకున్నట్లు వచ్చే వరకు అస్సలు సంతృప్తి చెందాడు. రోజులకు రోజులు గడిచిపోయినా సరే రాజమౌళి మాత్రం వెనుకడుగు వెయ్యరు. అందుకే ఈయన సినిమా చేయాలంటే హీరోలు చాల ఓపికతో సిద్ధపడతారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ అనంతరం ఈ చిత్ర షూటింగ్ పున : ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్-చరణ్ ల నడుమ ఓ భారీ ఫైట్ సీన్ ను ఆర్ఆర్ఆర్ లో వున్న సంగతి తెలిసిందే. ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే ఈ భారీ ఫైట్ సీన్ అటు మెగా ఇటు నందమూరి అభిమానులను పూర్తిగా అలరించేలా వుండాలన్నది రాజమౌళి తపన. ఈ ఫైట్ సినిమాలో ఎనిమిది నిమిషాలు వుంటుందని తెలుస్తోంది. అయితే తెల్లవారుఝామున ఈ సీన్ తీస్తున్న టైమ్ లో ఓ షాట్ ఎంత ట్రయ్ చేసినా రాజమౌళికి సంతృప్తి కలిగించలేదట.
ఇంక చాలు వదిలేద్దాం జక్కన్నా అని హీరోలు ఇద్దరూ చెప్పినా రాజమౌళి ఏమాత్రం వినలేదట. ఇక చేసేదేం లేక ఆఖరికి రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగ్దత. తానే రోప్స్ కట్టుకుని, పైనుంచి ఫీట్ చేస్తూ దూకి తనకు కావాల్సిన ఎఫెక్ఠ్ ను చూపించారట. దాంతో ఇక మాట్లాడేది లేక హీరోలు ఇద్దరూ మరో టేక్ చేసి ఓకె చేయించుకున్నారట. అల రాజమౌళి రంగంలోకి దిగి చూపిస్తే కానీ అనుకున్నది అనుకున్నట్లు రాలేదట. ప్రస్తుతం ఈ విషయం గురించి ఇండస్ట్రీ లో అంత మాట్లాడుకుంటున్నారు.