రామ్ చరణ్ తేజ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు తన సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. అయితే ఈ చిత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళేలాగా కనిపించడం లేదు. అందుకు కారణం శంకర్ ఇండియన్ 2 సినిమాతో మరల బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేశాడు. నిర్మాతలతో కొన్ని కారణాల వలన ఈ చిత్రం యొక్క షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఆ సమస్య పరిస్కారం కావడంతో ఇండియన్ 2 ను రీ స్టార్ట్ చేయబోతున్నాడు. కావున వీరి కాంబినేషన్ లో సినిమా లేట్ అయ్యేలాగా ఉంది. త్వరలో శంకర్ ఇండియన్ 2 చిత్రం యొక్క మిగతా షూటింగ్ బ్యాలెన్స్ ను పూర్తి చేసే పని పెట్టుకున్నాడు.
చరణ్ కూడా శంకర్ తో సినిమాకోసం ఆర్ఆర్ఆర్ మరియు ఆచార్య చిత్రాలను పూర్తి చేశాడు. శంకర్ ఇండియన్ 2 తో బిజీ కాబోతున్న కారణంతో చరణ్ అయోమయంలో పడిపోయాడు. ఇక నెక్స్ట్ మంత్ నుండి చరణ్ ఖాళీగా ఉండాలిసి వస్తుంది. దాదాపుగా ఆరు నెలల సమయం ఖాళీగా ఉండాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జులై లో శంకర్ తో సినిమా సెట్స్ పైకి వెళ్ళేది. మరి చరణ్ ఈ గ్యాప్ ను మరో సినిమాతో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ టాప్ దర్శకులు చరణ్ కు కథలను చెప్పారు. అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇటీవలే ఓ కథను చెప్పాడు. చరణ్ ఆ ముగ్గురు దర్శకుల కథలను అలాగే ఓల్డ్ లో పెట్టాడు.
మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరికి ఓకే చెప్పనున్నాడో తెలియాలంటే మరికొద్ది రోజులు అగాలిసిందే. విజయ్ మాస్టర్ సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న లోకేష్ కు చరణ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ష్ట్రి లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు . కరోనా కారణంగ ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. కరోనా ఇలాగే కొనసాగితే మాత్రం అందరు ఇంటికి పరిమితం కావలిసి వస్తుంది. కరోనా తగ్గుముఖం పడితే తప్ప మరల షూటింగ్ లకు పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు.