సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దేవి శ్రీ సంగీత సారథ్యంలో రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలె తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మొదలైంది. కాగా చిత్ర యూనిట్ లో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడం తో పాటు ఓ వ్యక్తి మరణించడం తో వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్ ను రద్దు చేసి హైదరాబాద్ కు తిరిగివచ్చింది. కొన్ని రోజుల పాటు చిత్ర యూనిట్ లోని కొంతమంది ఇంటికే పరిమితమితం కావాల్సి ఉండడం తో తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది తెలియడం లేదు.
ఇక అల్లు అర్జున్ మాత్రం దొరికిన ఈ సమయాన్ని నిహారిక పెళ్లికి వాడుకుంటున్నాడు. గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. ఆగస్ట్‌లో చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకోగా, డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఉదయ్ పూర్ కు ప్రత్యేక విమానాలలో వెళ్లడం జరిగింది. వివాహానికి మొత్తం 120మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లికి ఆహ్వానించిన సమయంలో అందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.