ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ గా డిలీటెడ్ సీన్స్ అని మైత్రి మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానెల్ లో పెడుతున్నారు. అయితే పుష్ప (Pushpa)డిలీటెడ్ సీన్స్ ఖర్చు గురించి ఓ న్యూస్ లీక్ అయ్యింది. పుష్ప పార్ట్ 1 ది రైజ్ లో డిలీట్ చేసిన సీన్స్ బడ్జెట్ ఖర్చు అక్షరాల 12 కోట్లట. అయ్యబాబోయ్ ఆ బడ్జెట్ తో నాలుగు చిన్న సినిమాలు తీసేయొచ్చు అనుకోవచ్చు.
సుకుమార్ సినిమా అంటే బడ్జెట్ ఆ రేంజ్ లో ఉండాల్సిందే. సినిమాకు పనికి వస్తాయని భారీ ఖర్చుతో తీసిన కొన్ని సీన్స్ రన్ టైం కోస్మ్ కట్ చేయాల్సి వస్తుంది. ఫైనల్ వర్షన్ అయ్యాక ఈ సీన్స్ డిలీట్ చేస్తారు. అయితే పుష్ప లో ఇలా చాలా సీన్స్ కు కోత పడ్డదని టాక్. ఆ సన్నివేశాలు తీసినందుకు ఖర్చు 12 కోట్ల దాకా అయ్యిందని చెప్పుకుంటున్నారు.
ఇక పుష్ప (Pushpa)వసూళ్ల హంగామా గురించి చెప్పుకుంటే వరల్డ్ వైడ్ 300 కోట్ల కలక్షన్స్ తో దూసుకెళ్తుంది పుష్ప. పుష్ప రాజ్ ఊర మాస్ యాటిట్యూడ్.. శ్రీవల్లి అందాలు.. దేవి మ్యూజిక్ సినిమాను ఈ రేంజ్ సక్సెస్ అయ్యేలా చేశాయి. బాలీవుడ్ మాస్ ఆడియెన్స్ కు పుష్ప సినిమా బాగా ఎక్కేసింది. అందుకే అక్కడ పుష్ప రికార్డ్ కలక్షన్స్ సాధిస్తుంది.