డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్, అంతే డేరింగ్ కలిగిన హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్ (Liger). ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈమధ్యనే వచ్చిన లైగర్ ఫస్ట్ గ్లింప్స్ అంచనాలు పెంచేసింది.
ఫస్ట్ గ్లింప్స్ తోనే లైగర్ కథ చెప్పేసిన పూరీ స్క్రీన్ ప్లేతో అదరగొడతాడని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరీ లైగర్ తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం లైగర్ తర్వాత పూరీ, విజయ్ Liger కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని అంటున్నారు. లైగర్ తో రెండేళ్లుగా పూరీతో పనిచేయడంతో అతనితో మంచి రిలేషన్ ఏర్పడిందట. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇయర్ ఆగష్టు 25న లైగర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మరి ఈలోగా షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.