డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత కన్నడ స్టార్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో పూరీ జగన్ గారు ఎప్పుడు టాప్ ఫైవ్ లోనే ఉంటాడు. ఆయన అంత త్వరగా ఎవరు సినిమాను పూర్తి చేయలేరు. ఫోర్, ఫైవ్ మంత్స్ లో సినిమాను పూర్తి చేస్తాడు. ఎన్నో హిట్స్ ను సొంతం చేసుకున్నా జగన్ ఆ మధ్య వరస ఫ్లాప్స్ తో కాస్త వెనకడుగు వేశాడు. కానీ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు.
ఓ వైపు సినిమాలు చేస్తూనే తన సోషల్ మీడియా చానల్ ద్వారా కూడా బాగా ఆక్టివ్ గా ఉంటాడు. వన్ ఇయర్ బ్యాక్ పూరీ మూసింగ్స్ అనే పేరుతో మోటివేశినల్ స్పీచ్ ఇస్తూ తనకు తెలిసిన కొత్త విషయాలను ఆ చానల్ ద్వారా తెలియజేస్తు ఉంటాడు. తాజాగా పూరీ జగన్నాథ్ వెన్నిస్ నగరం గురించి వివరించాడు ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒక్క సిటీ వెన్నిస్… దిన్నె వెనిజియా అంటారు 10 BC లో ఈ సిటీ ని కట్టారు అని.. 118 చిన్న చిన్న ద్వీపాలను కలుపుతూ మధ్య మధ్య లో కెనాల్ వేస్తూ ఈ వెన్నిస్ సిటీ ని కట్టారు అంట.
వెన్నిస్ నగరంలో కార్లు, బైకులు ఉండవు.. అక్కడ ఒక్క ఇంటి నుండి ఇంకో ఇంటికి వెళ్ళాలి అంటే పడవ వేసుకొని వెళ్ళాలి. ఆ పడవలను గండోలా లు అంటారు. ఒక్క గండోల వచ్చి 11 మీటర్లు ఉంటుంది. వెన్నిస్ అణువు అణువు చాలా అందమైనది. స్ట్రీట్ లైట్స్, బెంచెస్, ఆఖరికి చెత్త కుండీలు కూడా చాలా అందంగా ఉంటాయి. వెన్నిస్ లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివల్. అక్కడ ఫెస్టివల్ రోజున మాస్క్ వేసుకొని తిరుగుతారు… 16 వ శాతాబ్దంలో కార్నివల్ ఫెస్టివల్ రోజున ఎవరైనా మాస్క్ ధరించకపోతే రెండు సంవత్సరాల జైలు శిక్ష వేసేవారు.
ఎస్ షేప్ లో ఉన్న పెద్ద గ్రాండ్ కెనాల్ ఈ సిటీ డివైడ్ చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో మొట్ట మొదటి కసినో ఇక్కడే ఏర్పడింది. ప్రపంచంలో మొట్ట మొదటి గ్రాడ్యుయేట్ అమ్మాయి కూడా వెన్నిస్ నుండే వచ్చింది. అయితే వెన్నిస్ పెద్ద టూరిస్ట్ ప్లేస్ కావడంతో అక్కడ ఉండే లోకల్స్ కు ఇల్లు అద్దెకు దొరికేవి కావు అందుకే అక్కడ ఉన్న వెన్నిస్ ప్రజలు టూరిజం ఆపేయ్యాలని గొడవలు చేశారు. ఒక్కప్పుడు 125000 ల మంది ఉండే పాపులేషన్ ఇప్పుడు 60 వేలకు వచ్చింది. వెన్నిస్ నగరం రోజు రోజుకు సింక్ అవ్వుతుంది. 2030 నాటికి ఆ సిటీ దెయ్యాల గూడుగా మిగిలిపోయే అవకాశం ఉందని పూరీ జగన్ అన్నాడు.