ప్రముఖ ప్రొడ్యూసర్ డిఎస్ రావు ఈ మధ్య ప్రముఖ యూట్యూబ్ చన్నెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో చాలా ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నాడు. 2009 వ సంవత్సరంలో నితిన్ హీరోగా ద్రోణ అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి జె కరుణాకర్ దర్శకత్వం వహించాడు. ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి డిఎస్ రావు నిర్మాత. ద్రోణ చిత్రం నితిన్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ మూవీ.
ఈ చిత్రానికి ప్రియమణి బికిని సాంగ్ చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి.. ఈ సాంగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. ప్రియమణి ఈ చిత్రంలో బికిని వేసుకున్నందుకు బాగానే రెమ్యూనరేషన్ తీసుకునట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఆ చిత్ర నిర్మాత డిఎస్ రావు క్లారిటి ఇచ్చాడు. ఈ చిత్రానికి ముందుగా ప్రియమణిని హీరోయిన్ అనుకున్నప్పుడు. బికిని సాంగ్ ఉంటుందని చెప్పలేదు. షూటింగ్ మధ్యలో ఓ ఐటెమ్ సాంగ్ తరహా ప్రియమణి తో బికిని సాంగ్ చేద్దాం అని కోరాడు.
అప్పుడు ఆ విషయాన్ని ప్రియమనికి చెప్పడంతో ఆమె చాలా సానుకూలంగా స్పందించి సరే బికిని వేసుకోవడానికి నేను రెడీ అని చెప్పి చేసింది. అందుకు ఆమె ఎక్స్ట్రా పారితోషికం ఏమి తీసుకోలేదు. ఆ సాంగ్ కు ప్రియమణి బాగానే పారితోషికం తీసుకుంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని డిఎస్ రావు క్లారిటి ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రియమణి ఢీ జోడీ షో కు జడ్జ్ గా కొనసాగుతుంది. అలాగే సినిమాలలో మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. మొత్తానికి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది.