విశ్వసుందరి, బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మరల కొత్తగా పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోన్స్ కంటే ముందే బాలీవుడ్ సిరియల్స్ లో నటించిన మోహిత్ రైనా తో ప్రియాంకా చోప్రా కుటుంబ సభ్యులు నిశ్చితార్థం చేసుకున్నారు అంట. ఇంతకు ఆ మోహిత్ రైనా ఎవరు అనుకుంటున్నారా దేవోంకే దేవ్ మహదేవ్ సీరియల్ లో మహాశివుడు గా నటించాడు.
బాలీవుడ్ హీరోలకు సమంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతని సొంతం. ఆ పరమశివుడినే మైమరపించే రూపం తో ప్రజల మనసులను గెలుచుకున్నాడు. అతనితో పెళ్లి విషయమై, ప్రియాంకా చోప్రా కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు అంట ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. కానీ అనుకోని కారణాల వలన పెళ్లి పీటలు వరకు వెళ్ళిన పెళ్లి ఆగిపోయిందని చెప్పింది.
ఆ తర్వాత హాలీవుడ్ చిత్రాలో అవకాశం రావడం అక్కడే తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ అనే సింగర్ తో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది. ఆన్ ఫినిష్డ్ అనే పేరుతో తన జీవిత చరిత్రను బుక్ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం టెక్స్ట్ ఫోర్ యు మాట్రిక్స్ అనే చిత్రంలో నటిస్తుంది. హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటించడం లేదు. హిందీలో ప్రియాంకా చోప్రా ఆఖరి చిత్రం గంగాజల్.