ప్రణీత శుభాస్ కన్నడ సినిమా కు చెందిన నటీమణి. తెలుగులోనూ ఈమె చాలా చిత్రాలో నటించింది. అలాగే తమిళ సినిమాలోనూ అమ్మడు తన మార్కు చూపించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాలో నటిస్తుంది. అభిషేక్ దుధైయ దర్శకత్వంలో భుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రణీత వైట్ పెరిగే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలోని ఓ పాత్రలో ఆమె లావుగా కనిపించాలి.
అందుకే బరువు పెరిగే పనిలో ఉంది. సహజ సిద్ద పద్దతిలో బరువు పెరగాలని ప్రణీత భావిస్తుంది. ఎందుకు అంటే బాగా డైట్ తీసుకొని బరువు పెరిగితే ఆ తర్వాత ఎంత కష్టపడిన తగ్గలేము. సినిమా హీరోయిన్స్ సన్నగా ఉంటేనే అవకాశాలు వస్తాయి. కొంచెం బరువు పెరిగిన దర్శక నిర్మాతలు ఆమె వైపు కూడా చూడరు అలాంటిది ప్రణీత బాలీవుడ్ సినిమాకోసం సాహసమే చేస్తుందని చెప్పాలి. ఈ పాత్రకోసం ముందుగా బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. కానీ వారు ఎవరు చేయడానికి ముందుకు రాలేదు.
బరువు పెరిగిన అనుష్క పరిస్థితి ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం. లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేసుకోవాలిసిన పరిస్థితి వచ్చింది. బాహుబలి సినిమా తో పేరు సంపాదించుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే సోలో మూవీస్ కూడా రావడం కష్టం అయ్యేది. ఇప్పుడు స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చాన్సే లేకుండా పోయింది. ఏది ఏమైనా ప్రణీత తీసుకున్న నిర్ణయం మెచ్చుకోవాలిసిందే. ఈ సినిమా కోసం ఆమె అంత డెడికేషన్ చూపిస్తుందంటే గుర్తించాలిసిన విషయం. భుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతుంది. సంజయ్ దత్ కూడా మరో పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రమే కాకుండా బాలీవుడ్ లో “హంగామా 2” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు.