బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ ప్రదీప్ కు పేరు దక్కింది. ఆయన ఏ షో లో కనిపించినా అది సక్సెస్ అవుతుంది. ఆయన చేసిన అన్ని కార్యక్రమాలకు మంచి ఆధరణ దక్కుతున్న నేపథ్యంలో ఆయన్ను హీరోగా పరిచయం చేయాలని చాలా మంది ఆశించారు. కాని ప్రదీప్ మాత్రం వాటిని నో చెబుతూ వచ్చాడు. చివరకు ఆయన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రదీప్ అంతా సిద్దంగా ఉన్న సమయంలో కరోనా వచ్చింది. ఒకటి రెండు వారాల్లో సినిమా విడుదల కాబోతుంది అనగా థియేటర్లు మూత బడ్డాయి. అప్పటి నుండి కూడా సినిమా ల్యాబ్ కే పరిమితం అయ్యింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం మంచి సక్సెస్ అయ్యింది. అందువల్ల సినిమాకు మరింత క్రేజ్ దక్కింది.
థియేటర్ లలోనే సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని ఇప్పట్లో థియేటర్లు వచ్చే అవకాశం లేదు అని క్లారిటీ వచ్చింది. అందుకే ఇక చేసేది లేక ఓటీటీ రిలీజ్ కు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు దాదాపు రెట్టింపు ఇచ్చేందుకు రెడీగా ఉందట. గత రెండు నెలలుగా ఈ చర్చలు జరుగుతున్నాయి.
ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు మరియు యూనిట్ సభ్యులు అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి విడుదల తేదీ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఓటీటీ విడుదల విషయమై తుది నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రదీప్ మూవీ ఓటీటీలో చూడాలని కొందరు అభిమానులు ఆశిస్తుండగా మరికొందరు మాత్రం అందుకు నో చెబుతున్నారు.
ప్రదీప్ సినిమాను పెద్ద తెరపై మాత్రమే చూస్తామంటున్నారు. ఒకటి రెండు వారాల్లో సినిమా విడుదల విషయంలో ఫుల్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ప్రదీప్ మొదటి సినిమా విడుదల తర్వాతే రెండవ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడట. కనుక ఓటీటీలో ఈ సినిమా విడుదల చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.