పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటించగా… ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగానే హరిహర వీరమల్లు అనే సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టబోతున్నారు. దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా, ఆ తర్వాత సురేందర్ రెడ్డితో ఇంకో సినిమా చేస్తానని ఒప్పుకున్నట్లు సమాచారం. వీటితో పాటు తమిల రీమేక్ లో కూడా నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు.
అలాగే ప్రముఖ నిర్మాత కోనేరు సత్య నారాయణ.. పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఇటీవల ఖిలాడీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన పవర్ స్టార్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నినేరుగా పవన్ కల్యాణ్ తో చెప్పగా… అందుకు ఆయన ఒప్పుకున్నట్లు తెలిపారు. మంచి కథ దొరికితే కచ్చితంగా పవన్ అందులో చేస్తానని చెప్పినట్లు వివరించారు.
కోనేరు బ్యానర్ లో రమేష్ వర్మ ఎక్కువ సినిమాలు చేశారు. అయితే ఆయనకు సత్య నారాయణ ఓ కారుని గిప్టుగా కూడా ఇచ్చారట. ఖిలాడి సినిమా గనుక హిట్ అయితే పవన్ కల్యాణ్ కు కథ వినిపించే ఛాన్స్ రమేష్ వర్మకు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరో పక్క పవన్ కల్యాణ్ ఇంకో సినిమా చేసే ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తోంది. ఆయన సినిమాలు ఆపేసి పూర్తిగా రాజకీయలపై దృష్టి పెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కమిట్ అయిన సినిమాలు ఆలోపు పూర్తి చేసి… రాజకీయాల్లో గెలిచేందుకు కృషి చేయనున్నారట. ఒక వేళ కోనేరు నిర్మామంలో సినిమా ఒప్పుకున్నా… ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు.