నటి పూర్ణ గురించి అందరికి తెలిసిన విషయమే ఆమె అవును చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేడు మహిళ దినోత్సవం సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను సినిమాలోకి రావడానికి ముఖ్య కారణం మా అమ్మనే.. ఆమె చేసిన త్యాగమే నేను ఇక్కడ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుండి నాట్యం అంటే చాలా ఇష్టం.. అది గమనించిన మా అమ్మ ఆ దిశగా నన్ను ప్రోత్సహించింది. ఆ ఇంట్రెస్ట్ తోనే నేను సినిమాలోకి వచ్చాను. మాది ఒక్క మధ్య తరగతికి చెందిన ముస్లిం కుటుంబం. మేము మొత్తం అయిదు గురం నాలుగు అక్క చెల్లెలు ఒక్క తమ్ముడు. మా ఇంట్లో మహిళలదే మొదటి ప్రదాన్యం. సమాజంలో పురుషులతో సమానంగా మహిళకు గౌరవం, మర్యాద, భద్రత దక్కుతుందో అప్పుడే మహిళ దినోత్సవం కు పరిపూర్ణత. ఏదో ఒక్కరోజు మహిళలకు గౌరవం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళను మర్చిపోకూడదు.
తల్లితండ్రులు బయటకు పంపించే తమ ఆడపిల్లకు ఎన్ని జాగ్రత్తలు చెబుతుంటారు. బయట అల ఉండకూడదు. ఇలా చేయకూడదు. ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో ఎక్కువ గా మాట్లాడకూడదు. పెద్దవారిని గౌరవించాలి అని ఇలా ఎన్నో చెబుతూ ఉంటారు. అలాంటివి ఒక్క అమ్మాయి విషయంలోనే కాకుండా అబ్బాయికి కూడా చెబుతే మహిళలపై జరిగే దాడులు, రేపులు, అలాంటివి ఏమి జరగకుండా ఉంటాయి. అబ్బాయిల తల్లితండ్రులు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వాలని చిన్నప్పటి నుండే నేర్పించాలి. నేను ఇంత పెద్ద అయిన మా అమ్మ నాకు అన్నీ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది.
సినిమా విషయానికి వస్తే ఇండస్ష్ట్రి కి చాలా మంది ఆడవాళ్ళు రావాలి. ఇప్పటి వరకు మొగవారు మాత్రమే అత్యాదిక సంఖ్యలో అన్నీ రంగాల్లో ఉన్నారు. దర్శకత్వం వైపు కూడా ఆడవాళ్ళు అడుగులు వెయ్యాలనేది నా యొక్క కోరిక. హీరోయిన్స్ పాత్రలే కాదు మొగవారితో సహా అన్నీ బాద్యతలు తీసుకోవాలి. నేను సినిమా ఇండస్ష్ట్రి కి వచ్చి 15 ఏండ్లు అవ్వుతుంది. అయిన నటిగా నాకు మంచి గుర్తింపు దక్కింది. పెద్ద హీరోల పక్కన నటించకున్న పూర్ణ అంటే చాలా మందికి తెలుసు అనేది నా అభిప్రాయం. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ మంచి రోల్ లో నటిస్తున్నాను. అలాగే వెంకటేష్ దృశ్యం 2 లో కూడా నాది మంచి పాత్రనే.