![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/Police-case-booked-on-7-arts-sarayu-for-allegedly-insulting-hindu-gods.jpg?resize=800%2C500&ssl=1)
బిగ్ బ్యాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన 7 ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటించే చాలా వీడియోలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. బోల్డ్ కంటెంట్, భూతులతో ఆమె చేసే వీడియోలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా ఆమె బెదరకుండా తాను చేయాలనుకున్నవి చేస్తూనే ఉంది.
విమర్శలు ఎన్ని వచ్చినా తట్టుకున్న సరయుకు… గతేడాది బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె హోటల్ వ్యాపారంలోకి దిగింది. అయితే తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల సరయు తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన ఒక పాటలో తీవ్ర అభ్యంతరాలున్నాయంటూ పలువురు ఆరోపించారు.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/Police-case-booked-on-7-arts-sarayu-for-allegedly-insulting-hindu-gods-1-2.jpg?resize=795%2C447&ssl=1)
సరయు తాజాగా రూపొందించిన ఆ పాటలోని దృశ్యాలు హిందువుల మనోభావాలను కించ పరిచేలా ఉన్నాయంటూ ఫిర్యాదు దాఖలైంది. ఇదే విషయంలో యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫెం సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అయితే అక్కడి నుంచి కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
హిందువుల మనోభావాలను కించ పరిచేలా సరయు చేసిన వీడియోను తొలగించాలని… అలాగే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశఅవ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేవూరి ఆశోక్ కోరుతున్నారు. ఆయనే సరయుపై ఫిర్యాదు చేసింది.