పవన్ కళ్యాణ్ మూడున్నర ఏండ్ల తర్వాత నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ కి రీమేక్. అక్కడ విజయం సాదించడంతో తమిళంలో అజిత్ ను హీరోగా పెట్టి రీమేక్ చేశారు. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో పవన్, వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా మహిళలు ఈ చిత్రాన్ని బాగా అదరిస్తున్నారు.
ఆడవారిపై జరిగే అన్యాయాలపై ఫోకస్ చేస్తూ ఈ సినిమాను రూపొందించారు. పింక్ చిత్రాని తెలుగు నేటివిటీకి తగిన విధంగా కొద్దిగా చేంజ్ చేస్తూ రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని బోణి కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. ఇప్పటికే దిల్ రాజు కు ఈ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే మరి కొద్ది రోజులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఆడించాలని నిర్మాత ప్రయత్నిస్తున్న ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రలో కరోనా మహమ్మారి విపరీతంగా ఉండటంతో సినిమా థియేటర్స్ ను మూసి వెయ్యాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో దిల్ రాజు వకీల్ సాబ్ చిత్రాన్ని ఓటిటి లో రిలీజ్ చెయ్యడానికి సిద్దం అవ్వుతున్నాడు. అమెజాన్ వంటి పెద్ద ఓటిటి సంస్థ వకీల్ సాబ్ చిత్రాన్ని భారీ ధరకే కొనుగోలు చేసింది. వచ్చే నెల 7 వ తేదీన ఈ చిత్రం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నది. ఇక ఈ చిత్రంలో అంజలి నివేత థామస్, అనన్య నాగళ్ళ లు కీలక పాత్రలో నటించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు పవన్ ల మధ్య వచ్చే కోర్టు సీన్స్ హైలెట్ గా నిలిచాయి. శృతి హాసన్ పవన్ కు జోడీగా నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలు రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి.