పవన్ కళ్యాణ్ సినిమాలోకీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం మలయాళం మూవీ అయ్యపనుమ్ కొషియమ్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 45 రోజులు డేట్స్ కేటాయించాడు. మరో పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే క్రిష్ తో ఓ పీరియాడికల్ మూవీ చెయ్యాలిసి ఉంది. ఆల్రెడీ క్రిష్ ఈ చిత్రం యొక్క షూటింగ్ ను మొదలు పెట్టాడు.
ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంది ఆ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్ళుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని దర్శకుడు సిద్దంగా ఉన్నాడు. క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలు పూర్తి చేసిన తర్వాత తన తదుపరి సినిమాను బండ్ల గణేశ్ నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అప్పుడు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా నా దేవుడు నాకు మరో ఛాన్స్ ఇచ్చాడు అంటూ ట్వీట్ చేశాడు.
పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కోసం జనగణమన అనే సినిమాను చేయాలి అనుకుంటున్నాడు. ఆ దిశ గా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈమధ్యనే పవన్ ను కలిసి కథను నరేట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే వార్తలు నిజం కాబోతున్నాయి. అవును పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అల్ మోస్ట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రాని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.