పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే బాహుబలి వంటి పెద్ద హిట్ తో బాక్సాఫీసును బద్దలు చేసిన ఈ స్టార్ హీరో ఏక కాలంలో ఎనిమిది సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నారట. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ వాట్ ప్లనానింగ్ డార్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలన్నీ మూడేళ్లలోనే విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇదంతా వినడానికి బాగానే ఉన్నా… ఇక్కడే అసలు టెన్షన్ మొదలైంది. ఈయన 8 సినిమాలు చేస్తున్నారన్న మాట వాస్తవమే అయినా ఏ సినిమా ఎప్పుడు చేస్తున్నారనేది మాత్రం చాలా మందికి తెలియట్లేదు. క్రేజీయెస్ట్ హీరోగా పేరు సంపాదించికున్న ఈయనతో సినిమాలు చేసేందుగు పెద్ద పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు మరింత ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అయితే ఒక్కో సినిమాకు ప్రభాస్ 150 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందుకే ఆయనతో చేసే సినిమాలన్నీ పాన్ ఇండియనే. దాదాపు ప్రతీ సినిమాకు కనీసం 200 నుంచి 350 కోట్ల వరకు బడ్జెట్ పెడతున్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభాస్ కూడా చాలానే కష్టపడుతున్నారు. అందుకే పాన్ ఇండియా కథలు మాత్రమే చేస్తున్నారు. సాహో తెలుగులో ప్లాప్ అయినా హిందీలో సూపర్ హిట్ అయింది. అదే ప్రభాస్ లో కాన్ఫిడెన్స్ ని పెంచింది. అందుకే వరసగా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నాడు.
రాధే శ్యాం సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది కాబట్టి దీనికి ఏ సమస్యా లేదు. అయితే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా చేసేందుకు ప్రభాస్ ఒప్పుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీలు, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగాలు క్యూలో ఉన్నారట. అలాగే ఆది పురుష్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. సలార్ షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది. అయితే 2022లో మూడు, 2023లో మరో మూడు సినిమాలు మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతాయి.