నటి హేమ చాలా మందికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు. కానీ నిజానికి ఆమె మొదట హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తల్లి, అక్క, వదిన, చెల్లి పాత్రలు చేస్తుంది. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే నువ్వు నాకు నచ్చావ్, అతడు, అత్తారింటికి దారేది, బుజ్జిగాడు, అష్టా చమ్మ, దూసుకెళ్తా ఇలా ఎన్నో మూవీస్ కామిడి పరంగా ఆమెకు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.
దాదాపుగా అన్నీ బాషల్లో కలిపి 200 చిత్రాల్లో నటించింది. నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3 లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్నది. నటి హేమది ప్రేమ వివాహం ముస్లిం కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. 2014 లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైఖ్యాంద్ర పార్టీ తరుపున మండపేట నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఆమె చివరి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం తర్వాత ఆమె మరే ఏ చిత్రంలోనూ నటించలేదు. తాజాగా ఆమె తన ఇంస్టా గ్రామ్ లైవ్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించారు.
ఓ అభిమాని మీరు చాలా హాట్ గా ఉంటారు అని కామెంట్ చేయగా అందుకు హేమ నేను చూడటానికి పిచ్చిదాని లాగా ఉంటాను ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు. నా ముక్కు కూడా కొంచెం వంకరగా ఉంటుంది. ఓ సారి యాక్సిడెంట్ వల్ల అల అయింది అంది. నా అభిమానులు నన్ను చాలా మంది అక్క అని పిలుస్తున్నారు. అలా పిలవాలంటే చాలా గట్స్ ఉండాలి అది నా అభిమానులకు ఉంది. నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అని అన్నారు. నాకు కరోనా వచ్చి వెళ్లిపోయింది. చాలా మందికి కరోనా వచ్చిన లక్షణాలు ఏమి తెలియడం లేదు అందుకే సిటీ స్కాన్ తీయించుకోవడం చాలా మంచిది అని అన్నారు. చివరగా అందరు మస్కూలు, సానిటైజర్స్ వాడాలని కోరింది.