స్టార్ మా యజమాన్యం బిగ్ బాస్ మొదలు పెట్టినప్పుడు మొదట ఏ సెలబ్రేటితో హోస్టింగ్ నిర్వహించాలనే ఆలోచనలో పడింది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద రియాలిటీ షో మొదటి సీజన్ కే ప్రేక్షకులనుండి బ్యాడ్ ఓపినియన్ వస్తే టిఆర్పి రేటింగ్ మొత్తం పడిపోయే అవకాశం ఉంది. అందుకే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టిఆర్ ను రంగంలోకి దింపింది. తారక్ తన వాక్ చాతుర్యంతో షో పై అంచనాలను పెంచాడు. సీజన్ వన్ అత్యదిక టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది.
ఇటీవల కాలంలో జెమిని టివి యజమాన్యం తారక్ తో ఓ షో ను నిర్వహించనున్నదనే వార్తలు వచ్చాయి. ఆ షో స్టార్ మా లో కింగ్ నాగార్జున హోస్ట్ గా వచ్చిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే ప్రోగ్రాం హక్కులను జెమిని టివి దక్కించుకుంది. దానికి హోస్ట్ గా తారక్ రాబోతున్నాడు అంటూ ప్రచారం సాగింది. అయితే ఈ షో మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. కానీ అనూహ్యంగ ఈ షో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఎన్టిఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉండటం వల్లనే ఈ షో ఆగిపోయింది తారక్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుండి ఫ్రీ అవ్వుతున్నాడు. తాజా సమాచారం మేరకు జెమిని టివి యజమాన్యం మరోసారి ఈ షో ను తెరపైకి తీసుకువచ్చింది. అందుకు అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ ను కూడా నిర్మించారు. ప్రస్తుతం ఎన్టిఆర్ తో ప్రమోషన్ యాడ్ షూట్ ను చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆద్వర్యంలో ఈ యాడ్ షూట్ జరుగుతుంది. త్వరలోనే ఈ షో పై అధికారిక క్లారిటీ రానున్నది. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమాలో నటించనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి “అయిననూ పోయిరావలె హస్తినకు” అనే టైటిల్ ప్రచారంలో ఉంది.