నందమూరి తారక రామారావు తర్వాత ఆ కుటుంబం నుండి ఓ ఐదుగురు హీరోలు వచ్చారు. కానీ అందులో ఇద్దరికి మాత్రమే సీనియర్ ఎన్‌టిఆర్ కు ఉన్న పేరు ఉంది. అది ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వారే బాలకృష్ణ, ఎన్‌టిఆర్. హిట్స్ ప్లాప్ లతో సంబందం లేకుండా వీరికి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు వీరిని ఒకే రకంగా అభిమానులు ఆరాధిస్తారు.
సామాన్య ప్రజల నుండి రాజకీయ నాయకుల వరకు వీరికి మామూలు క్రేజ్ లేదు. వీరిద్దరు వేరే వేరు సినిమాల్లో ఒకే పాత్రలో నటించారు. అప్పుడు ఆ పాత్రలో నటించిన బాలకృష్ణ ను ప్రజలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఎన్‌టిఆర్ ను మాత్రం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇంతకు ఏ పాత్ర, ఏ సినిమా అనుకుంటున్నారు కదా.. లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన పరమవీరచక్ర. ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మించాడు.
ఈ చిత్రంలో బాలకృష్ణ కొమురం భీమ్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇదే కొమురం భీమ్ పాత్రను ఎన్‌టిఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ అనే చిత్రంలో పోషిస్తున్నాడు. పీరియాడికల్ నేపథ్యం కలిగిన ఈ చిత్రంలోని అల్లూరి సీత రామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఎన్‌టిఆర్ కొమురం భీమ్ లుక్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అచ్చం బాలకృష్ణ పరమవీర చక్ర లుక్ ను పోలి ఉన్న ఎన్‌టిఆర్ ఆర్‌ఆర్‌ఆర్ కొమురం భీమ్ లుక్ ప్రేక్షకులను మెప్పించగలదా లేదా అనేది తెలియాలి అంటే అక్టోబర్ 13 వరకు అగాలిసిందే.