పవన్ కళ్యాణ్ హీరో గా ఎస్జే సూర్య దర్శకత్వంలో రెండు చిత్రాలు వచ్చాయి. అందులో ఖుషీ చిత్రం చాలా మంచి సక్సెస్ ను అందుకుంది. మరో చిత్రం కొమురం పులి. ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో నికిషా పటేల్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నికిషా మొదటి చిత్రమే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.
కొమురం పులి ప్లాప్ నికిషా కెరీర్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. మోడలింగ్ పై అనుభవం ఉన్న నికిషా మరోసారి కెరీర్ ను మోడలింగ్ వైపు మళ్ళించింది. అప్పుడు గోపిచంద్ హీరో గా నటించిన లక్ష్యం సినిమాను కన్నడలో వరదనాయక పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రం.లో నికిషా పటేల్ కు హీరోయిన్ గా మరోసారి అవకాశం వచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సాదించింది.
ఆ తరవాత కన్నడలో చాలా చిత్రాలో నటించింది. తెలుగులో ఓ ఆరు చిత్రాలు. తమిళంలో ఓ రెండు చిత్రాలు చేసింది. కరోనా కారణంగ షూటింగ్ లు పోస్ట్ పోన్ అవ్వడంతో లండన్ కు చెక్కేసింది. గత కొంతకాలం గా అక్కడే ఉంటూ కమర్షల్ యాడ్ షూట్ నిమిత్తం అక్కడే బిజీ అయిపోయింది. గత కొంతకాలంగా ఇండియా కు రావడం లేదు.
ఈ విషయంపై ఆమె ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఇండియాకు వస్తాను నేను కంప్లీట్ చెయ్యాలిసిన సినిమా షూటింగ్ లు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియా కు రావాలంటే కష్టమే సెకండ్ వేవ్ కరోనా బాగా వ్యాపించడంతో మరికొంత సమయం పడుతుంది. కరోనా తగ్గుముఖం పట్టేవరకు ఇండియాకు రాలేను అని నికిషా తెలిపింది.