లేడి సూపర్ స్టార్ నయనతార తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. విఘ్నేష్ శివన్ తో ప్రేమలో కూడా అంతే బిజీగా ఉంది. ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయంపై వీరు మాత్రం అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, అందుకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఆరోజు అయిన వీరి ప్రేమకు పెళ్లి కార్డు తో శుభం పలుకుతారేమో అని నయన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
విజయ్ సేతుపతి, నయనతార కలిసి జంటగా నటించిన నేను రౌడీనే చిత్రం తో విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. అప్పటినుండి వీరు డేటింగ్ చేస్తూనే ఉన్నారు. వీరిద్దరు సేమ్ ఫీల్డ్ లో ఉండేసరికి ఒక్కరిపై ఒక్కరికి మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. ఖాళీ సమయం దొరికినప్పుడళ్ళ ప్రేమ విహార యాత్రలు చేస్తూ ఉంటారు. ఆ మధ్య మాల్దీవులో దిగిన రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు మరోకొన్ని రోజుల్లో రాబోతుంది కావున మరోసారి ఆ త్రో బ్యాక్ ఫోటోలోని టాప్ టెన్ లోని ఫైవ్ ఫోటోస్ అనుకున్న గోల్స్ ను రీచ్ అయ్యాయి అందులోని ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో లైకులు,కామెంట్స్ తో మరోసారి ట్రెండ్ సృష్టిస్తున్నాయి.
ప్రేమికుల రోజు కంటే ముందు నిరంతరం ప్రేమలో ఉండటం ఈ జంటకే చెందింది. నయన్ గతం విషయానికి వస్తే మొదట శింభు తో చాలా ఏండ్లు ప్రేమాయణం సాగించింది. విరిద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ ని ప్రేమించింది. పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన విడిపోయారు. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఈ ప్రేమ అయిన సక్సెస్ కావాలని ఆమె, అభిమానులు కూడా కోరుకుంటున్నారు.