తమిళంలో జయం రవి నటించిన సూపర్ హిట్టు చిత్రాల్లో ఒక్కటి తని ఒరువన్ ఆ చిత్రానికి మోహన్ రాజ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తెలుగులో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి తో 153వ చిత్రాని రూపొందించనున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ గారు నటించిన లూసిఫర్ చిత్రాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు వినిపించిన చివరకు తమిళ దర్శకుడు చేతిలో ఈ ప్రాజెక్ట్ ను పెట్టారు.
ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగిన విదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు. పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లను దర్శకుడు సిద్దం చేశాడు. ఇక ఈ చిత్రంలో మెగా స్టార్ కి జోడీగా నయనతార నటించనున్నదని సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులనుండి వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం మేరకు లూసిఫర్ రీమేక్ లో నటించ వద్దు అని నిర్ణయం తీసుకున్నారు అంట. అందుకు కారణం ఏమిటి అంటే…
మలయాళం లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ సరసన ఏ హీరోయిన్ నటించలేదు. తెలుగు రీమేక్ లో మెగాస్టార్ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి కోసం హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశాడు అంట. అందుకే ఆమె ఈ పాత్ర చేయడం ఇష్టం లేక తప్పుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఈ పాత్రలో ఎవరిని తీసుకోవాలనే విషయంపై దర్శకుడు అన్వేషణ మొదలు పెట్టాడు. ఈ చిత్రాని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఎన్‌విఆర్ బ్యానర్ పై ఈ చిత్రాని నిర్మించనున్నారు.