నయనతార ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్. మొదట మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టి, ఆ తర్వాత సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ లు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నయన్ తెలుగులో వెంకటేష్ తో కలిసి లక్ష్మి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రభాస్, నాగార్జున, బాలకృష్ణ, రవి తేజ, ఎన్టిఆర్ లతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. నయన్ మొదటి నుండి కూడా తమిళ సినిమాపైనే బాగా ఫోకస్ చేయడంతో ప్రస్తుతం అక్కడే ముఖ్యమైన సినిమాలు చేస్తూ సెట్టిల్ అయ్యింది
సినిమాలోకి వచ్చిన కొత్తలో మొదట హీరో శింభు తో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ను ప్రేమించింది. వీరిద్దరు పెళ్లి వరకు వెళ్ళి విడిపోయారు. కొంతకాలం ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టిన నయన్ ఆ తర్వాత దర్శకుడు విజ్ఞేష్ శివన్ ను ప్రేమించింది. నేను రౌడీనే అనే సినిమా షూటింగ్ టైంలో విజ్ఞేష్ నయన్ కు ప్రపోజ్ చేయడం ఆమె వెంటనే ఓకే చెప్పడంతో ఆ తర్వాత వీరిద్దరు డేటింగ్ లు అంటూ తెగ తిరిగేస్తు కొలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు.
చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విజ్ఞేష్ కుటుంబ సభ్యులు కూడా ఈ ఏడాది వీరిద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అయితే నయన్ మాత్రం ఈ ఏడాది వద్దు వచ్చే ఏడాది పెళ్లి చేసుకుందాం అని విజ్ఞేష్ కుటుంబానికి చెప్పిందని అక్కడి మీడియా నుండి అందుతున్న సమాచారం. మరి నయన్ మాట కు విలువ ఇచ్చి వచ్చే ఏడాది అగుతారో లేక ఈ ఏడాదినే పెళ్లి చేసుకుంటారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు అగాలిసిందే. ఇప్పుడు కరోనా బాగా విస్తరిస్తుండటంతో ఫంక్షన్స్ పెళ్లిలు చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు.