నవదీప్ జై సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా పది సినిమాల లోపే నటించాడు. కెరీర్ ను సరైన ట్రాక్ లోకి వస్తుంది అనుకునే లోపే పలు వివాదాలలో ఇరుక్కున్నడు. ఆ దెబ్బతో మనోడి గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ఇంకా చేసేది ఏమి లేక ప్రస్తుతం అయిన నటిస్తున్న చిత్రాలలో సహాయ నటుడుగా, విలన్ గా మంచి పత్రాలను చేస్తున్నాడు. ఈ సందర్భంగా నవదీప్ మోసగాళ్ళు అనే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు.
ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ విష్ణు కు అక్కగా నటించింది. ఇటీవలే ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో చాలా బిజీగా ఉంది.. ఈ సందర్భంగా నవదీప్ కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమంలో బాగం అయ్యాడు. ఈ క్రమంలో నవదీప్ మాట్లాడుతూ.. అయిన జీవితంలోని కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నాడు…. “నాకు చినప్పటి నుండి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అయిన ఇన్స్ ప్రెషన్ తోనే నేను నటుడిని అయ్యాను…ఎన్సిసి లో అమ్మకి చిరంజీవి గారు సీనియర్.. ఆ సమయంలో మా అమ్మ చిరంజీవి గారితో ఓ ఫోటోను తీసుకున్నారు.
నాకు అప్పుడప్పు ఆ ఫోటోను చూపిస్తు ఉండేది.. నాకు ఊహా తెలిసే సరికే అయిన పెద్ద స్టార్ హీరో అయ్యాడు. అయినను ఆదర్శంగా తీసుకొని సినిమాలోకి వచ్చాను.. ఆ సమయంలో అల్లు అర్జున్, శిరీష్ లతో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆ తర్వాత రానా, చరణ్ లు పరిచయం అయ్యారు.. నన్ను అందరు మెగా ఫ్యామిలీకి సంబందించిన హీరో అనుకునేవారు.. మొదట్లో నేను చేసిన చిన్న చిన్న తప్పులే ఆ సమయంలో నన్ను కోలుకోకుండా చేశాయి. నవదీప్ అంటేనే బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడింది అందరిలో.. కానీ నా గురించి నాకు బాగా తెలుసు.. అది పోగొట్టుకోవడానికే నేను బిగ్ బాస్ రియాలిటీ షో లో అడుగు పెట్టాను. అక్కడ నన్ను నన్నుగా చూపించారు. ఆ షో వలన నాకు మంచే జరిగిందని నవదీప్ అన్నాడు