![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/11/nazriya.jpg?resize=500%2C300&ssl=1)
నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో మలయాళ నటి నజ్రియా పహధ్ ను ఎంపిక చేసారు. ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో నాని 28వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా లో నజ్రియా ఫహద్ సొంతంగా డబ్బింగ్ చెప్పబోతుందట.
తెలుగు నేర్చుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉండగా..నజ్రియా మాత్రం ఈ సినిమాకు పనిచేస్తుండటంపై చాలా ఎక్జయిటింగ్ గా ఉందట. నాని ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రంతో బిజీగా ఉండటంతో కొత్త సినిమా షురూ అవడానికి మరికొంత సమయం పట్టనుంది. చేతిలో సమయం ఉండటంతో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సూచనల మేరకు త్వరలోనే తెలుగు నేర్చుకునే పనిలో ఉందట నజ్రియా .