![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/12/chaitnya-krishna-wedding.jpg?resize=800%2C444&ssl=1)
నందమూరి కుటుంబంలో పెళ్లి సందడి జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు మొట్టమొదటి మనువడు, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయ కృష్ణ తనయుడు నందమూరి చైతన్య కృష్ణ ఓ ఇంటివాడు అయ్యాడు. రేఖ గుమ్మడితో చైతన్య కృష్ణ వివాహం శుక్రవారం జరిగింది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/12/chaitnya-krishna-wedding2.jpg?resize=800%2C565&ssl=1)
సీనియర్ నటి రాధిక రాడాన్ మీడియా ద్వారా నిర్మించిన ‘ధమ్’ సినిమాతో నటుడిగా పరిచయం అయిన చైతన్య కృష్ణ ఆ తర్వాత బిజినెస్ వ్యవహారల్లో బిజీ అయిపోయారు. గత 18 ఏళ్లుగా కాలిఫోర్నియాలో నివాసముంటున్న రేఖను ఆయన వివాహం చేసుకున్నారు. రేఖ ఎవరో కాదు.. ఎన్టీఆర్తో పలు సూపర్ హిట్ చిత్రాలు తీసిన విజయ వాహిని స్టూడియోస్ అధినేత ఆలూరి చక్రపాణి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక ఈ వివాహ వేడుకకు కళ్యాణ్ రామ్, బాలయ్య రెండో అల్లుడు శ్రీ భరత్ దంపతులు, చంద్రబాబు అలానే బంధు మిత్రులు హాజరు అయ్యారు.