అక్కినేని ఫ్యామిలీ తో విక్రమ్ కే కుమార్ మనం అనే చిత్రంను రూపొందించాడు. ఈ చిత్రంలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, అఖిల్, సమంత, లు కలిసి నటించారు. మూడు తరాలను కలిపి అద్బుతంగా చూపించాడు. ఈ చిత్రంతో అఖిల్ తెలుగు సినిమా ఇండస్ష్ట్రి కి పరిచయం అయ్యాడు. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను అలరించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 280 కోట్లు పెట్టి అక్కినేని ఫ్యామిలీ నిర్మిస్తే 620 కోట్లు వసూళ్లు చేసింది. లెజండరి నటుడు అక్కినేని నాగేశ్వరావు కు ఇది చివరి చిత్రం. ఈ చిత్రం యొక్క షూటింగ్ సమయంలో ఆయన క్యాన్సర్ తో బాద పడుతున్నాడు. సినిమాపై ఆయనకు ఉన్న పట్టుదలతో ఆయన పోర్షన్ ను పూర్తి చేశాడు. ఇక నాగార్జున తన క్లాస్ ఫర్ఫార్మేంస్ తో ఇరగదీశాడు. నాగ చైతన్య, తను చేసుకోబోయే భార్య సమంత ను అక్కినేని ఫ్యామిలీ అంటూ ఇంట్రడ్యూస్ చేశాడు.
ఈ చిత్రం తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు. గతంలో మనం చిత్రానికి సీక్వెల్ పై వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా అవే వార్తలు మరోసారి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెక్కర్లు కొడుతున్నాయి. మనం కి సీక్వెల్ తీసే ఆలోచనలో నాగార్జున, విక్రమ్ కే కుమార్ లు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈ ఇద్దరు కూడ బలమైన ఆసక్తి తో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నాడు అంట. ఈ ఏడాది చివరి లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత బంగార్రాజు అనే చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మనం కూడా అదే సమయంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. దర్శకుడు విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం నాగ్ చైతన్య తో థాంక్యూ అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు.