విజయ్ దేవరకొండ హీరోగా భారత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం “సవ్యసాచి”. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రూపొందింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవి చూశాయి.
ఆ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ వై, రవి శంకర్ వై లకు భారీ నష్టాని మిగిల్చింది. ఈ క్రమంలో అప్పటి నష్టాని రీసెంట్ గా “ఉప్పెన” చిత్రంతో కవర్ చేశారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్రం రికార్డ్ స్థాయిలో వసూళ్లను కురిపిస్తుంది. మొదటి ఆట నుండి కూడా ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో పబ్లిక్ లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజీ వచ్చింది. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ లో నిర్మిచారు కావున ఆ రెండు చిత్రాలకు వచ్చిన నష్టాన్ని, ఉప్పెన చిత్రంతో రికవరీ చేశారు.
నిర్మాతలకు లాభం వస్తేనే కదా సినిమాలు అనేవి నిర్మించేది. తెలుగు చిత్ర పరిశ్రమ పదికాలాల పాటు చల్లగా ఉండాలి అంటే మాత్రం నిర్మాతలకు ఆదాయం తెచ్చే సినిమాలు రావాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” చిత్రాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో “సర్కారు వారి పాట” అనే చిత్రాని కూడా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా భారీ తారాగణం మరియు భారీ బడ్జెట్ తో కూడిన చిత్రాలు కావున ఈ చిత్రాలు కూడా విజయం సాదిస్తాయి అని నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.