దర్శకుడు నాగ్ అశ్విన్ శేఖర్ కమ్ముల దగ్గర అస్సిస్టెంట్ డైరెక్టర్ గా చాలా చిత్రాలకు పనిచేశాడు. ఒకానొక సందర్భంలో వైజయంతీ బ్యానర్ లో సినిమాలు చేయడం ద్వారా నా అదృష్టం మారిపోయింది అని అంటున్నాడు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఈ చిత్రంలో నాని హీరోగా నటించాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.
ఇది ఒక్క ప్రయోగాత్మక సినిమా అయిన కానీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ లభించిందని అన్నాడు. అలాగే ఈ చిత్రం తర్వాత సావిత్రి బయోపిక్ ను మహానటి పేరుతో తెరకెక్కించాను. కీర్తి సురేశ్ లీడ్ రోల్ లో నటించింది. ఇది ఒక్క లేడి ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెతో నిర్మించాడు.
నా మీద ఉన్న నమ్మకంతో ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం అనేది సాదారణ మైన విషయం కాదు. అని అన్నాడు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాను. ఇది కూడా హై బడ్జెట్ తో కూడినది. మరోసారి వైజయంతి బ్యానర్ లో పెద్ద సినిమా రాబోతుంది. ప్రభాస్ స్టార్ డమ్ ను గుర్తుంచుకొని పాన్ ఇండియా లేవలో ఈ చిత్రాని రూపొందనున్నదని అన్నాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటీమణి దీపిక పదుకునే హీరోయిన్ గా నటించనున్నది. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సలార్ చిత్రాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఈ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే రాధా కృష దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్రాని పూర్తి చేశాడు. ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.