కరోనా సెకండ్ స్టేజ్ కారణంగ చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఆక్సిజన్, సరైన మెడిసిన్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రం ముందుగానే కరోనా నుండి బయట పడటానికి ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో తీసుకుంటున్నారు. డబ్బులేనివారు సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం హాస్పిటల్ చుట్టి లెఫ్ట్ రైట్ అంటూ తిరుగుతున్నారు. మరికొంత మంది మాత్రం మస్కూలు సానిటైజర్స్ వాడుతూ తమను తాము రక్షించుకుంటున్నారు..
కరోనా కు పెదవాడు, డబ్బు ఉన్నవాడు అనే తేడా ఏమి తెలియదు కదా అందరు కరోనాకు ఎఫెక్ట్ అవ్వుతున్నారు.తాజాగా ఓ నిర్మాత ఓ హాస్పిటల్ లో ఓ సూట్ రూమ్ ను బుక్ చేసుకున్నాడు. దానికి అతను లక్షల్లో బిల్లు చెలిస్తున్నాడు. ఆ మధ్య కరోనా రావడంతో ముందుగా ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ లో సూట్ రూమ్ ను బుక్ చేసుకున్నాడు. కరోనా లక్షణాలు అంతగా లేకపోయిన అక్కడే కొన్ని రోజుల పాటుగా ఉండి రెస్ట్ తీసుకొని బయటకు వచ్చాడు.
ఆ తర్వాత కూడా అసూట్ రూమ్ తన పేరునే బుక్ చేసుకున్నాడు. తన ఫ్యామిలీ లో ఎవరికైనా కరోనా సోకితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని భయంతో ఆ రూమ్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఆ నిర్మాతకు తెలిసిన వారు ఎవరైనా కరోనా భారీన పడితే ఆ సూట్ రూమ్ ను సజెస్ట్ చేస్తున్నాడు.
ఏదైనా డబ్బు ఉన్నవాడు లేని వాడుకి చాలా తేడా ఉంది. అది కరోనా విషయంలో కూడా నిరూపించాడు ఓ బడా నిర్మాత. మరి ఆ నిర్మాత ఎవరు అనేది తెలియాలిసి ఉంది.