‘సుడిగాడు’ చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన మోనాల్ గజ్జర్..తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతీ భాషల్లో కలిపి సుమారు 20 చిత్రాల్లో నటించింది. అయితే 20 చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులర్ కానీ ఈమె బిగ్ బాస్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు లో అతి పెద్ద రియాల్టీ షో గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో..ప్రస్తుతం 4 సీజన్ జరుపుకుంటుంది. మరో వారం రోజుల్లో ఈ షో ముగుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4లో గ్లామరస్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంటరైన మోనాల్.. గత ఆదివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో 98 రోజులు గడిపింది.
బిగ్ బాస్ దెబ్బకు ఈ బ్యూటీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత మోనాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీ అయిపొయింది. ఇందులో భాగంగానే మోనాల్ తన లవ్ బ్రేకప్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ‘ఓ మలయాళీ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొంతకాలం రిలేషన్ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. లవ్ బ్రేకప్ అవ్వడం వల్లే సౌత్ సినిమాలకు దూరమయ్యానని’ మోనాల్ చెప్పుకొచ్చింది.