కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..చిరంజీవి నటిస్తున్న ఆచార్య సెట్ కు వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఒకప్పుడు చిరంజీవి – మోహన్ బాబు ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది..కానీ ఇప్పుడు అవన్నీ మరచిపోయి మంచి మిత్రులుగా మెలుగుతున్నారు. ఒకరి ఫంక్షన్లకు మరొకరు హాజరవ్వడమే కాదు గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ మోహన్ బాబు – చిరంజీవి కలిసి ముచ్చటించారు.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న నేపథ్యంలో ‘ఆచార్య’ సెట్స్ కి విచ్చేసి చిరు కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మోహన్ బాబు. చిరంజీవి కి పూల బొకే అందించిన మోహన్ బాబు.. అక్కడే కాసేపు ఉండి చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే..ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. దీనికి డైమెండ్ రత్న బాబు దర్శకత్వం చేస్తున్నాడు.