కొరటాల శివ సక్సెస్ సినిమాల దర్శకుడు, అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్నాడు. అందుకే చాలా మంది యువ, సీనియర్ హీరోలు కొరటాల తో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే నెల 13వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో సినిమా విడుదల పై అనేక అనుమానాలు ఉన్నాయి.
ఆచార్య చిత్రం తర్వాత తన తదుపరి సినిమాను ఎన్‌టిఆర్ తో చేయబోతున్నట్లుగా నిన్న ప్రకటన వచ్చేసింది. నిజానికి మెగాస్టార్ తో సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాపై గతంలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని యువసుధ, గీతా ఆర్ట్స్ లు కలిసి నిర్మించనున్నాయి అని పోస్టర్ కార్డ్ పేరుతో రిలీజ్ చేశారు… కానీ తాజాగా ఎన్‌టిఆర్ తో కొరటాల నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసేసరికి అల్లు అర్జున్ తో సినిమా కాన్సెల్ అయి ఉంటుందని మెగా, అల్లు అభిమానులు భావించారు.
ఇక సోషల్ మీడియా నుండి అందుతున్న సమాచారం మేరకు కొరటాల సినిమా స్క్రిప్ట్ విషయంలో బన్నీ సాటిస్ఫాక్షన్ గా లేడు అని తెలుస్తుంది. అందుకే సినిమా పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటి అనే విషయాన్ని ప్రముఖ నిర్మాత మిక్కిలినేని సుధాకర్ క్లారీటి ఇచ్చాడు కొరటాల శివ, బన్నీ కాంబినేషన్స్ లో రాబోయే మూవీ క్యాన్సల్ అవ్వలేదు వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవ్వబోతుంది అని తెలిపాడు. ఈ గ్యాప్ లో ఎన్‌టిఆర్ తో సినిమాను తెరపైకి తీసుకెళ్లబోతున్నాడు అంటూ తెలిపాడు. ఎన్‌టిఆర్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, కల్యాణ్ రామ్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ జూలై లో సెట్స్ పైకి వెళ్లుతుంది.